కృష్ణాజిల్లాకు జాతీయ అవార్డు
మచిలీపట్నం: దేశంలోనే అత్యుతమ జిల్లా పరిషత్‌గా మన రాష్ట్రానికి చెందిన కృష్ణా జిల్లా నిలిచింది. దేశంలో పంచాయితీ వ్యవస్థ ఏర్పడి యాభై ఏళ్లు పూర్తైన సందర్భంగా అఖిల భారత్ పంచాయితీ పరిషత్తు అనే స్వచ్ఛంద సంస్థ స్వర్ణోత్సవ సంబరాలు చేపట్టింది. పంచాయితీ రాజ్ వ్యవస్థ పరిపుష్టికి ఈ పరిషత్తు కృషి చేస్తోంది. వాటి పనితీరును సమీక్షించి ప్రోత్సహించే చర్యలో భాగంగా ఈ ఏడాది తొలిసారిగా ఉత్తమ జడ్పీ అవార్డ్ ప్రకటించింది.
ఆయా జడ్పీలు పంపిన సమాచారం సమీక్షించి కృష్ణా జిల్లా పరిషత్‌ను ఉత్తమ జడ్పీగా ఎంపిక చేశారు. ప్రతీ నెల క్రమం తప్పని సమీక్షా సమావేశాలు, ఆదాయాన్ని పెంచుకునే చర్యలు, అధివృద్ధి కార్యక్రమాలు, ఐఎస్‌ఓ సర్టిఫికెట్ సాధన తదితర అంశాలు కృష్ణా జిల్లా పరిషత్‌ను దేశంలోనే అత్యుత్తమ జడ్పీగా నిలిపాయని పాలకవర్గం అభిప్రాయపడింది.












Click it and Unblock the Notifications