స్టాక్ మార్కెట్ పతనాన్ని ఊహించిన తెలుగువాడు

Katragadda
హైదరాబాద్‌: వ్యక్తుల జాతకాలు చెప్పగల జ్యోతిషులు, బాబాలు, స్వామీజీలు ఉంటే ఉండవచ్చు. కానీ స్టాక్ మార్కెట్ భవిష్యత్తును విశ్లేషించగల నిపుణులు ఉన్నారా? "నేనున్నాను" అంటున్నారు అమెరికాలో ఉంటున్న ప్రవాసాంధ్రుడు కృష్ణ ప్రసాద్ కాట్రగడ్డ్. భారత స్టాక్‌ మార్కెట్‌ కాస్త నిలదొక్కుకున్నట్టే నిలదొక్కుకునిశుక్రవారం నాడు ఉండీ ఉండీ ఒక్కసారిగా 10,000 పాయింట్లు దిగువకు పడిపోయింది. ఈ వారం మొదట్లో రయ్‌మని పైకి లేచిన స్టాక్‌ మార్కెట్‌ ఒక్కసారిగా కుదేలైపోవడం ఆర్థిక పండితులను కూడా ఆశ్చర్యపరిచింది.

కాని ఈ మార్కెట్‌ పదివేల పాయింట్లకు క్రిందికి పోతుందని ముందే ఊహించి విశ్లేషించి చెప్పిన తెలుగువాడు కృష్ణప్రసాద్‌ కాట్రగడ్డ. అమెరికా ఆర్ధిక వ్యవస్థ మాంద్యం దిశగా పరుగులు తీస్తోందని, ఎవరు ఔనన్నా కాదన్నా ఆర్థిక సంక్షోభం ప్రపంచం మొత్తాన్ని కబళించబోతున్నదని ఆయన ఈ సంవత్సరం జనవరి నెలలోనే హెచ్చరించారు. స్టాక్‌ మార్కెట్‌లో నష్టపోకుండా ఉండాలంటే ఎంత త్వరగా కళ్ళు తెరిస్తే అంత మంచిదని ఆయన ఆ రోజునే తెలుగువారిని అప్రమత్తం చేశారు.

అమెరికా ఆర్థిక వ్యవస్థ దిశ చూస్తుంటే కుప్పకూలిపోబోతున్న స్టాక్‌ మార్కెట్లను నిలువరించడం ఎవ్వరి తరమూ కాదని, వివేకవంతులు వెంటనే స్టాక్‌లు విక్రయించుకోవడం మంచిదనీ ఆయన జాగ్రత్త చెప్పారు. మరీ ముఖ్యంగా భారత స్టాక్‌ మార్కెట్‌ 35వేలకు సైతం వెళ్ళగలదని పెక్కుమంది భారత స్టాక్‌ విశ్లేషకులు ఆశాభావం వ్యక్తంచేస్తున్న సమయంలోనే అమెరికా స్టాక్‌ మార్కెట్‌ ఇన్వెస్టర్‌- ఎనలిస్టు అయిన కృష్ణప్రసాద్‌ కాట్రగడ్డ భారత మార్కెట్‌ 10వేల పాయింట్లు దిగువకు పడిపోవడం ఖాయమని అప్పుడే చెప్పారు.

శుక్రవారంనాడు అదే జరిగింది. ఆ క్రాష్‌ను ముందే ఎలా ఊహించారన్న ప్రశ్నకు మార్కెట్‌ నడకను లోతుగా అధ్యయనం చేయడం వల్ల అది సాధ్యమైందని ఆయన వివరించారు. స్టాక్‌ మార్కెట్‌లో సర్వం కోల్పోతున్న కుటుంబాల గురించి బయటి ప్రపంచానికి కొద్ది కొద్దిగానే తెలుస్తున్నదని, కూలిపోతున్న మార్కెట్‌ వల్ల చితికిపోతున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయని, అటువంటివారు ఇప్పటికైనా మేల్కొనాలని ఆయన హెచ్చరిస్తున్నారు. అమెరికా ఆర్థిక సంక్షోభం గురించి, భారత స్టాక్‌ మార్కెట్‌ పతనం గురించీ 10 నెలల క్రిత మే కృష్ణప్రసాద్‌ కాట్రగడ్డ ఒక టి.వి. ఇంటర్వ్యూలో హెచ్చరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+