తెలంగాణ ఇవ్వకుంటే నష్టం: పాల్వాయి
హైదరాబాద్: 2009 ఎన్నికల లోగా తెలంగాణ రాష్ట్రం ఇవ్వకపోతే తమ పార్టీకి నష్టమేనని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. 2009 ఎన్నికల లోగా ఇవ్వకపోతే ఎన్నికల తర్వాతనైనా ఇస్తామని తెలంగాణ ప్రజలకు నమ్మకం కలిగించాలని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. ఈ విషయాన్ని తాము తమ పార్టీ నాయకురాలు సోనియా గాంధీకి చెప్పినట్లు ఆయన తెలిపారు.
హైదరాబాద్ తెలంగాణలో అంతర్భాగమేనని ఆయన అన్నారు. హైదరాబాదు తెలంగాణలో అంతర్భాగం కాదని ఎవరు వాదించినా అది తెలివి తక్కువ తనమేనని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల తర్వాత వైయస్ రాజశేఖర రెడ్డికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వకూడదని ఎవరైనా అంటే ఏదైనా సాధ్యమేనని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీతో గానీ, సిపిఎంతో గానీ పొత్తు పెట్టుకుంటే నష్టపోయేది తెలంగాణ రాష్ట్ర సమితేనని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications