చంద్రయాన్ -1 ప్రయోగం సఫలం

Chandrayaan-1
శ్రీహరికోట: శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష పరిశోధనా కేంద్రం (ఇస్రో) చేపట్టిన చంద్రయాన్ - 1 ప్రయోగం విజయవంతమైంది. మానవ రహిత వ్యోమనౌకతో పిఎస్ఎల్వీ - సీ 11 ను బుధవారం 6 గంటల 22 నిమిషాలకు భారత శాస్త్రవేత్తలు ప్రయోగించారు. భూకక్ష్యలోకి ఉపగ్రహాన్ని పంపడం భారత్ కిదే మొదటిసారి. రాకెట్ భూకక్ష్యలో రెండు సార్లు భ్రమించి ఆ తర్వాత చంద్రకక్ష్యలోకి ప్రయాణం పెట్టింది. ఇది సెకనుకు 8.9 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది. వచ్చే నెల 8వ తేదీ నాటికి ఇది చంద్రమండలం కక్ష్యలోకి చేరుకుంటుంది. ఈ ప్రయోగంతో భారత్ లూనార్ క్లబ్ లో చేరింది. ఈ ప్రయోగంతో భారత్ అగ్రరాజ్యాల సరసన నిలిచింది. చంద్రమండలం మీదికి ఉపగ్రహాన్ని పంపిన ఆమెరికా, రష్యా, జపాన్, చైనా, ఇతర అగ్రరాజ్యాల జాబితాలో భారత్ చేరింది. ఈ ప్రాజెక్టు వ్యయం 386 కోట్ల రూపాయలు. చంద్రయాన్ ప్రయోగం కోసం 2003 నుంచే ప్రయత్నాలు జరగుగుతున్నాయి. అయితే 2005లో అనుమతి లభించింది.

చంద్రయాన్ - 1 ప్రయోగంలో నాలుగేళ్ల భారత శాస్త్రవేత్తల కృషి వుంది. ఉపగ్రహం సరైన కక్ష్యలో ప్రయాణం చేస్తోందని ఇస్రో చైర్మన్ మాధవన్ నాయర్ చెప్పారు. శాస్త్రవేత్తలను ఆయన అభినందించారు. ఇదొక చారిత్రక ఘట్టమని, ఈ ఘట్టం చరిత్రలో నిలిచిపోతుందని ఆయన అన్నారు. ఈ కలను సాకారం చేసిన ప్రతి ఒక్కరికీ సెల్యూట్ అని ఆయన అన్నారు. బారత శాస్త్రవేత్తలను రాష్ట్రపతి ప్రతిభా పాటిల్, ప్రధాని మన్మోహన్ సింగ్, యుపిఎ చైర్ పర్సన్ సోనియా గాంధీ అభినందించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి, ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబునాయుడు కూడా భారత శాస్త్రవేత్తలను అభినందించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+