చరిత్రాత్మక ప్రయోగం: నాయర్
శ్రీహరికోట: చంద్రయాన్ ప్రయోగం చరిత్రాత్మకమైనదే కాదు భారత అంతరిక్ష చరిత్రలో ఎప్పటికీ మైలురాయిగా నిలిచే ప్రయోగమని ఇస్రో ఛైర్మన్ మాధవన్ నాయర్ అన్నారు. ఈ ప్రయోగం విజయవంతం అయినట్లు ప్రకటించిన అనంతరం ఆయన మీడియా సమావేశంలో పాల్గొన్నారు.
చంద్రునిపై రహస్యాలను శోధించేందుకు ప్రయాణం ఇప్పుడే ప్రారంభమైందని, ఇది ముందు ముందు మరిన్ని అద్భుతాలను ఆవిష్కరిస్తుందని ఆయన అన్నారు. సీఎస్‌ఎల్‌వీ-11 వచ్చే నెల 8నాటికి చంద్రుని కక్ష్యలోకి చేరుతుందని ఆయన తెలిపారు. ఈ ప్రయోగంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ సెల్యూట్ అని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications