ఎన్టీఆర్ తో చంద్రబాబు మంతనాలు

ఇరువురి మధ్య దాదాపు గంటన్నర సేపు చర్చలు జరిగాయి. చంద్రబాబు మంగళవారం సాయంత్రం ఫోన్ చేసి జూనియర్ ఎన్టీఆర్ ను బుధవారం ఉదయం అల్పాహార విందుకు ఆహ్వానించారు. ఈ ఆహ్వానం మేరకు జూనియర్ ఎన్టీఆర్ బుధవారం ఉదయం చంద్రబాబు నివాసానికి వెళ్లారు. గన్నవరం సీటు విషయంలో తన సోదరుడు కళ్యాణ్ రామ్ తో ఏర్పడిన వివాదం వల్ల జూనియర్ ఎన్టీఆర్ అలిగినట్లు చెబుతున్నారు. హరికృష్ణకు సన్నిహితుడైన దాసరి బాలవర్ధన రావు గన్నవరం శాసనసభ సీటును ఆశిస్తున్నారు. దీంతో ఆయన కళ్యాణ రామ్ తో ఈ నెల 24వ తేదీన బారీ ర్యాలీని తలపెట్టారు. ఇదే సీటును తనకు సన్నిహితుడైన వల్లభనేని వంశీ మోహన్ కు ఇప్పించుకోవాలని జూనియర్ ఎన్టీఆర్ ప్రయత్నిస్తున్నారు. తనకు వ్యతిరేకంగా కళ్యాణ్ రామ్ వ్యవహరించడంపై జూనియర్ ఎన్టీఆర్ అలిగినట్లు చెబుతున్నారు. యువగర్జన సదస్సు తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తో గన్నవరంలో భారీ ర్యాలీని తలపెట్టినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications