మరిన్ని కష్టాల్లో రాజ్ థాకరే

కంజూర్ మార్గ్ సంఘటనకు సంబంధించి రాజ్ పై చర్యకు ప్రభుత్వం కోరుతున్నది. విఖ్రోలీ కేసులో రాజ్ థాకరేకు బెయిల్ నిరాకరించాలని ప్రభుత్వం కోర్టును కోరబోతున్నది. రాజ్ థాకరే గతంలో ఈ ఏడాది ఫిబ్రవరి 13వ తేదీన అరెస్టయ్యారు. అయితే వెంటనే బెయిల్ పై విడుదలయ్యారు. రెచ్చగొట్టే ప్రసంగాలు చేయకూడదని షరతు విధించి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఆయన కోర్టు షరతును ఉల్లంఘించారని ప్రభుత్వం వాదిస్తోంది. పరిస్థితిని సమీక్షించడానికి మహారాష్ట్ర మంత్రివర్గం బుధవారం అత్యవసరంగా సమావేశమైంది. రాజ్ థాకరే రాత్రంతా లాకప్ లోనే ఉన్నారు. మంగళవారం రాత్రి ఎంఎన్ఎస్ కార్యకర్తలు 15 టాక్సీలను ధ్వంసం చేశారు.












Click it and Unblock the Notifications