మా ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు: పిఆర్పీ
హైదరాబాద్: తమ సెల్ ఫోన్లను అధికార కాంగ్రెస్ పార్టీ వారు ట్యాప్ చేస్తున్నారని ప్రజారాజ్యం పార్టీ అధికార ప్రతినిధి పరకాల ప్రభాకర్ ఆరోపించారు. కాంగ్రెస్ కుయుక్తులకు పాల్పడుతోందని ఆయన శుక్రవారం ఒక ప్రైవేట్ టీవీ చానెల్ ప్రతినిధితో అన్నారు. ఈ విషయంపై తాము రాష్ట్రపతికి, గవర్నరుకు ఫిర్యాదు చేస్తామని ఆయన చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు బెదిరింపులకు కూడా పాల్పడుతున్నారని ఆయన చెప్పారు.
తమ నేత చిరంజీవి ఉత్తరాంధ్ర పర్యటనపై ప్రజల నాడిని తెలుసుకోవడానికి తాము సర్వే తలపెట్టామని, సర్వే చేస్తున్నవారిని కూడా బెదిరిస్తున్నారని ఆయన చెప్పారు. విజయనగరం జిల్లాలో సర్వే చేస్తున్న తమవారిని పోలీసులు బెదిరించారని, సర్వే చేయకుండా అడ్డుకున్నారని ఆయన అన్నారు. తమ పార్టీ వైపు వస్తున్న ఎంపిటిసిలను, సర్పంచులను బెదిరిస్తున్నారని ఆయన చెప్పారు. ప్రభుత్వం తీరుపై తాము ఆందోళనకు దిగుతామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications