తెలంగాణ బిల్లుపై చర్చ లేదు
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ (బిజెపి) తెలంగాణపై ప్రతిపాదించిన ప్రైవేట్ బిల్లు లోకసభలో శుక్రవారం చర్చకు రాలేదు. ఈ బిల్లుపై చర్చ కోసం ఆంధ్రప్రదేశ్ యావత్తూ ఆసక్తితో ఎదురుచూసింది. అయితే లోకసభ వేరే కార్యక్రమం చేపట్టడంతో ఆ బిల్లు చర్చకు రాలేదు. తదుపరి సమావేశాల్లో దీనిపై చర్చకు అనుమతిస్తామని డిప్యూటీ స్పీకర్ చెప్పారు. బిల్లును చర్చకు తీసుకోవాలని తాను కోరానని, అయితే ప్రస్తుతం జరుగుతున్న చర్చ అత్యంత ప్రధానమైందని హోంమంత్రి చెప్పారని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నాయకుడు కె. ఎర్రంనాయుడు చెప్పారు.
తెలంగాణపై చర్చ జరగడం కాంగ్రెసుకు ఇష్టం లేదని, అందుకే ఈ పరిస్థితి కల్పించిందని ఆయన విమర్శించారు. తాము తెలంగాణకు పూర్తి అనుకూలంగా ఉన్నామని, అందుకు అనుగుణంగా వ్యవహరించడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు. కాంగ్రెసు తెలంగాణ వ్యవహారంపై తప్పించుకోవడానికి ప్రయత్నిస్తోందని ఆయన విమర్శించారు.












Click it and Unblock the Notifications