దుర్గ గుడిలో కార్తీకమాసోత్సవాలు

మూడు వేళలా అభిషేకాలు
మల్లేశ్వరాలయంలో కార్తీకమాసం నెలరోజులూ మూడు వేళలా మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్ర వారాభిషేకాలు నిర్వహించనున్నారు. ఉదయం 6 నుంచి 9గంటల వరకు, ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అభిషేకాలు జరుగుతాయి. మధ్యాహ్నం 1.30 గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు సహస్ర లింగార్చన జరుగుతుంది.
లక్షబిల్వార్చన: వచ్చేనెల 3, 9, 10, 13, 17, 23, 24, 26 తేదీలలో వచ్చే నాలుగు సోమవారాలు, రెండు ఏకాదశులు, పౌర్ణమి, మాసశివరాత్రి రోజులలో మల్లేశ్వరుడికి లక్ష బిల్వార్చన చేస్తారు. 17 వతేదీన జ్వాలాతోరణాన్ని ఆవిష్కరిస్తారు. మాస శివరాత్రి రోజున లక్ష బిల్వార్చనతో పాటు అన్నాభిషేకాన్ని కూడా నిర్వహిస్తారు. ప్రతిరోజూ మధ్యాహ్నం ఒంటిగంట నుంచి రాత్రి 7 గంటల వరకు లక్ష బిల్వార్చన కార్యక్రమం ఉంటుంది.












Click it and Unblock the Notifications
