నేను వచ్చాకే ప్రేమ కురిపించారు: చిరు

Chiranjeevi
కరీంనగర్: తాను సిరిసిల్లా చేనేత కార్మికులను పరామర్శించిన తర్వాతనే మిగతా రాజకీయ పార్టీల నాయకులు బారులు తీరి ప్రేమ కురిపించారని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి అన్నారు. రాజకీయ నేతలు బారులుగా వచ్చి వరాలు కురిపించారని, అవి కంటితుడుపు చర్యగానే మిగిలిపోయాయని ఆయన అన్నారు. ఉత్తర తెలంగాణ ప్రాంతంలో చిరంజీవి ప్రజా అంకిత యాత్ర గురువారం ఉదయం ప్రారంభమైంది. తన యాత్రను ఆయన కరీంనగర్ జిల్లా సిరిసిల్ల నుంచి ప్రారంభించారు. తాను ఇంతకు ముందు చేనేత కార్మికులను పరామర్శించడానికి వచ్చిన తర్వాతనే మిగతా పార్టీల నాయకులు ఉలిక్కిపడి సిరిసిల్లకు వచ్చారని ఆయన అన్నారు.

సమ్మక్క సారక్కలకు మొక్కు తీర్చుకుని ఉత్తర తెలంగాణ ప్రజా అంకితయాత్రను ప్రారంభించాలనే సూచన తనకు వచ్చిందని, అయితే మానవ సేవ మాధవ సేవ అనే దృష్టితో సమస్యలు ఉన్న ప్రజల చెంత నుంచి యాత్రను ప్రారంభించాలని ఇక్కడికి వచ్చానని ఆయన చెప్పారు. తాము అధికారంలోకి రాగానే చేనేత కార్మికుల రుణాలన్నీ రద్దు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. అంతే కాకుండా, నిల్వ, మార్కెటింగ్ కు ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. చేనేత కార్మికలకు ఆధునిక పద్ధతుల్లో శిక్షణ ఇచ్చేందుకు సిరిసిల్లలో అధ్యయన, శిక్షణ అధ్యయన కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. బలవన్మరణాల సందర్భాల్లో రెండున్నర వేల రూపాయలేసి ఫిక్స్ డ్ డిపాజిట్ చేస్తామని ఆయన చెప్పారు. వృద్ధులకు ఆవాస కేంద్రం ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+