తెలంగాణపై చెప్పే వెళ్తా: చిరంజీవి

Chiranjeevi
కరీంనగర్: తెలంగాణపై తన నిర్ణయాన్ని ప్రకటించిన తర్వాతనే తెలంగాణ పర్యటనను ముగిస్తానని ప్రజారాజ్యం అధినేత చిరంజీవి చెప్పారు. సమయం, సందర్భం చూసుకుని తెలంగాణ పర్యటన ముగిసే లోగా స్పష్టమైన ప్రకటన చేస్తానని ఆయన చెప్పారు. కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో ఆయన ఆ విధంగా అన్నారు. తనను తెలంగాణ ప్రజలు గుండెల్లో పెట్టుకుని అభిమానించారని, తనకు తెలంగాణ ప్రజల గుండె చప్పుడు తెలుసునని, అందువల్ల కచ్చితంగా తాను తెలంగాణపై ప్రకటన చేస్తానని ఆయన చెప్పారు. తన సినిమాలను ఎక్కువ ఆదరించింది తెలంగాణ ప్రజలేనని, తన సినిమాలకు తెలంగాణలోనే కలెక్షన్లు ఎక్కువగా వచ్చాయని, తనను ఆ విధంగా ఆదరించిన తెలంగాణ ప్రజల మనసు తెలుసుకుని వ్యవహరిస్తానని ఆయన అన్నారు. తాను తనను ఆదరించిన ప్రజలకు పాదదాసుడ్నవుతానని ఆయన అన్నారు.

తాను ప్రజల గురించి ఆలోచించే వాడినని, అందువల్ల ప్రజల ఆలోచనలేమిటో తెలిసినవడినని ఆయన అన్నారు. తెలంగాణ వీరగడ్డ మీది నిలబడిన తర్వాత తెలంగాణపై చెప్పకుండా ఎలా ఉంటానని ఆయన అన్నారు. చిరంజీవి అందరి కన్నా ఒక్కడుగు ముందున్నాడని గద్దర్ అన్నారని ఆయన చెప్పారు. ప్రజా సమస్యలే తన ఎజెండా అని, తనకు వ్యక్తిగత ఎజెండాలు లేవని ఆయన చెప్పారు. తెలంగాణ గురించి చెప్పకుండా తాను ఇక్కడి నుంచి వెళ్లబోనని ఆయన అన్నారు. తిరుపతి సభలో తాను తెలంగాణ గురించి చెప్పినట్లు ఆయన గుర్తు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+