అస్సాంలో వరుస పేలుళ్లు: 54 మంది మృతి

బాంబు పేలుళ్లు దాదాపు పదకొండున్నర గంటల ప్రాంతంలో జరిగాయి. గౌహతిలో కర్ఫ్యూ విధించారు. బాంబు పేలుళ్ల వెనక ఉల్ఫా, హుజీల హస్తం ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. తొలి పేలుడు కూరగాయల, పళ్ల మార్కెట్ గల గణేష్ గురిలో జరిగింది. రెండో పేలుడు కామరూప్ జిల్లా డిప్యూటీ కమీషనర్ కార్యాలయం వద్ద జరిగింది. అక్కడ నిలిచి ఉన్న కార్లు, వాహనాలు ధ్వంసమయ్యాయి. బాంబు పేలుళ్లకు సంబంధించిన సమాచారాన్ని కేంద్రం ముందే రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసిందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జైస్వాల్ చెప్పారు. కేంద్ర మంత్రివర్గం అత్యవసరంగా సమావేశమైంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి పేలుళ్లపై నివేదికను కోరింజి. కోక్రాజార్ లో టూవీలర్ పై బాంబు పెట్టి పేల్చినట్లు తెలుస్తోంది. పేలుళ్లతో ఆగ్రహం చెందిన గౌహతి ప్రజలు పోలీసులపై రాళ్లు విసిరారు. గుంపులను చెదరగొట్టడానికి పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు.












Click it and Unblock the Notifications