చిరు వైఖరి తర్వాతే కాంగ్రెస్ నిర్ణయం

YS Rajasekhar Reddy
న్యూఢిల్లీ: తెలంగాణపై ప్రజారాజ్యం అధినేత చిరంజీవి తన వైఖరిని ప్రకటించే వరకు వేచి చూడాలని కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానవర్గం నిర్ణయించుకున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి కూడా తెలంగాణకు వ్యతిరేకంగా ఉండడంతో ఆ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. తెలంగాణపై తమ కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానవర్గం సరైన సమయంలో తగిన నిర్ణయం తీసుకుంటుందని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి చెప్పారు. బుధవారం సాయంత్రం పార్టీ కోర్ కమిటీతో సమావేశమైన అనంతరం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్‌ పరిస్థితి చాలా సానుకూలంగా ఉందని ముఖ్యమంత్రి వైఎస్‌ కాంగ్రెస్‌ అధిష్ఠానానికి చెప్పినట్లు సమాచారం. చిరంజీవి ప్రజారాజ్యం ఆవిర్భావంతో రాష్ట్రంలో ముక్కోణ పోటీ నెలకొంటుందని, అప్పుడు కాంగ్రెస్‌దే గెలుపని ఆయన ధీమా వ్యక్తం చేసినట్లు సమాచారం. సీనియర్ నేతల ఒత్తిడిని వారు వైయస్ దృష్టికి తెచ్చారు.

సోనియా రాజకీయ కార్యదర్శి అహ్మద్‌ పటేల్‌ సూచనల మేరకు వైఎస్‌ తెలంగాణపై తన అభిప్రాయాలను సవివరంగా తెలియజేశారు. పొత్తులు, ఎత్తులపరంగా తన వాదనలు వినిపించారు. చిరంజీవికున్న రాజకీయ బలంపై అంచనాకు మరికొంత సమయం పడుతుందని చెప్పారు. పార్టీ నిర్వహించిన సర్వేల సారాంశాన్ని తెలియజేశారు. 'అన్ని అవకాశాలకు తలుపులు తెరిచే ఉంచాలి. పరిణామాలను నిశితంగా గమనించాలి. తప్పనిసరై తెలంగాణకు అనుకూలంగా పార్టీ నిర్ణయం తీసుకోదలిస్తే అది కాంగ్రెస్‌కే ఉపయోగపడాలి. ఇతర పార్టీలకు ఆ ప్రతిష్ట దక్కకూడదు. కొందరు తెలంగాణ సీనియర్‌ నేతలు ప్రత్యేక రాష్ట్రం కోసం ఒత్తిడి తెస్తున్నారనే కారణంతో తుది నిర్ణయానికి రావద్దు' అని వైయస్ అధిష్ఠానవర్గానికి వివరించినట్లు సమాచారం. తెలంగాణలో కాంగ్రెస్‌ పరిస్థితి అత్యంత సానుకూల పరిస్థితి ఉందన్నారు. నాలుగున్నరేళ్లుగా తమ ప్రభుత్వంచేపట్టిన కార్యక్రమాలు ప్రభుత్వ వ్యతిరేకతను గణనీయంగా తగ్గించాయని, తెలుగుదేశం పార్టీ, ప్రజారాజ్యాల మధ్య కాంగ్రెస్‌ వ్యతిరేక ఓటు చీలిపోతుందని, కాంగ్రెస్‌కు లబ్ధి చేకూరుతుందని అని ఆయన చెప్పినట్లు సమాచారం. తెలంగాణపై చిరంజీవి ఇంకా స్పష్టమైన నిర్ణయానికి రానందున ఇంకొంతకాలం వేచిచూడాలని అధిష్ఠానం నిర్ణయించినట్లు తెలిసింది. తెదేపా-తెరాస-వామపక్షాల కూటమి, చిరంజీవి వైఖరివల్ల జరుగబోయే నష్టాన్ని బేరీజువేసి ఆలోచిద్దామని భావిస్తున్నట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+