బస్సు లోయలో పడి 18 మంది మృతి
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్ లోని సిమ్లా సమీపంలో గల కుఫ్రీ వద్ద ఒక ప్రైవేట్ బస్సు లోయలో పడడంతో దాదాపు 18 మంది మృత్యువాత పడ్డారు. ఈ ప్రమాదం మంగళవారం ఉదయం జరిగింది. బస్సులో 40 మంది దాకా ప్రయాణిస్తున్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. కుమార్ సీన్ పట్టణం నుంచి ఈ బస్సు రాష్ట్ర రాజధానికి బయలుదేరింది. ఈ పట్టణం రాష్ట్ర రాజధానికి 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
33 మంది దాకా మరణించినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే 18 మంది మరణించిన విషయాన్ని ముఖ్యమంత్రి ప్రేమ్ కుమార్ ధుమాల్ ధృవీకరించారు. గాయపడినవారిని ఇందిరా గాంధీ వైద్య కళాశాల ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించారు.












Click it and Unblock the Notifications