శని గోచారంతో ఈ రాశులవారికి 2027నుండి శని ప్రతికూలతల నుండి విముక్తి!
జ్యోతిష్యంలో శనిని చాలా నిదానంగా సంచరించే గ్రహంగా చెప్తారు. శని ప్రతీ రాశిలో దాదాపు రెండున్నరేళ్లు ఉంటాడు. కాబట్టి శని రాశి మార్పు చాలా కాలం వరకు ప్రభావం చూపుతుంది. ప్రస్తుతం శని మీన రాశిలో ఉన్నాడు. 2027 జూన్ 3న మేష రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ మార్పు కొన్ని రాశుల వారి జీవితంలో పెద్ద మార్పులు తీసుకురానుంది. ముఖ్యంగా ఏల్నాటి శని, అష్టమ శని, అర్దాష్టమ శని ఉన్న రాశుల విషయాల్లో ఇది ముఖ్యం.
మేషరాశి
మేష రాశి వారికి కొత్త దశ మొదలవుతుంది. శని వారి రాశిలోకి రావడం వల్ల కొన్ని మార్పులు అనుభవించవచ్చు. 2027లో శని మేషరాశిలోకి ప్రవేశించడం మేషరాశి వారి జీవితంలో బాధ్యతలు, సవాళ్లు ఎక్కువగా ఉన్నప్పటికీ, అవి మిమ్మల్ని మరింత క్రమశిక్షణతో, బాధ్యతతో ముందుకు సాగేలా ప్రేరేపించవచ్చు. చాలా కాలంగా నిలిచిపోయిన లేదా అంతరాయం కలిగిన కొన్ని పనులు నెమ్మదిగా మళ్లీ ఊపందుకునే అవకాశం ఉంది. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగితే స్థిరత్వాన్ని సాధించవచ్చు.

కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి కూడా రానున్న సంవత్సరం శని కారణంగా కొన్ని విషయాల్లో మంచిది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. ఉద్యోగంలో గుర్తింపు వస్తుంది.ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. జీతం పెరుగుదల రావచ్చు. కుటుంబంలో ప్రశాంతత పెరుగుతుంది. కర్కాటక రాశి జాతకులకు ఆర్థిక విషయాలలో ఊహించని లాభాలు లేదా అదనపు ఆదాయ అవకాశాలు కూడా లభించవచ్చు. కుటుంబంలో సంతోషం, శాంతి పెరుగుతాయి .
తులా రాశి
తులా రాశి వారికి గతంలో చేసిన కృషికి ఫలితాలు దక్కే సమయం. ఆర్థిక అవకాశాలు పెరుగుతాయి. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. నిర్ణయాల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.మీరు ఆర్థిక విషయాలలో మరింత స్థిరత్వాన్ని చూడవచ్చు. దీనితో పాటు, మానసిక ఒత్తిడి కూడా తగ్గే అవకాశం ఉంది. మీరు మీ నిర్ణయాల పట్ల మరింత ఆత్మవిశ్వాసంతో ఉండవచ్చు . భవిష్యత్ ప్రణాళికలు వేసుకోవడానికి అనుకూలమైన పరిస్థితి ఉంటుంది.
మకర రాశి
మకర రాశి వారికి వచ్చే ఏడాది కలిసి వస్తుంది. గత అడ్డంకులు తగ్గుతాయి. వృత్తిలో కొత్త అవకాశాలు, ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంది. కుటుంబ బాధ్యతలు సులభంగా నిర్వహించగలుగుతారుమీ ఆదాయాన్ని పెంచుకోవడానికి అవకాశాలు లభించవచ్చు. కుటుంబ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించడం ద్వారా మీరు మనశ్శాంతిని పొందవచ్చు.
కుంభ రాశి
కుంభరాశి వారికి ఈ సమయం చాలా ముఖ్యం. 2027 జూన్ 3న శని మేషంలోకి వచ్చినప్పుడు వారి ఏల్నాటి శని పూర్తిగా ముగుస్తుంది. ఏడున్నరేళ్ల శని ప్రభావం నుంచి బయటపడతారు. ఇన్నాళ్లు ఎదుర్కొంటున్న అడ్డంకులు క్రమంగా తగ్గుతాయి. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు మళ్లీ కదలడం మొదలవుతుంది. ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్ అవకాశాలు రావచ్చు. కొత్త ఉద్యోగం కోసం చూస్తున్నవారికి మంచి అవకాశాలు దక్కే అవకాశం ఉంది.
గమనిక: జ్యోతిష్య నిపుణులు, ఇంటర్నెట్ లో లభించిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. దీనిని oneindia telugu ధృవీకరించలేదు. జ్యోతిష్యం వ్యక్తిగత జాతకాన్ని బట్టి మారవచ్చు కాబట్టి నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.













Click it and Unblock the Notifications
