క్షణ క్షణం.. భయం భయం.. అమెరికా అర్జెంట్ అలర్ట్! వణికిపోతున్న సౌదీ..

గల్ఫ్ రీజియన్‌లో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. పొరుగున ఉన్న యెమెన్ హౌతీ తిరుగుబాటుదారులు డ్రోన్లు, మిస్సైళ్లతో విరుచుకుపడుతుండటంతో సౌదీ అరేబియా తీవ్ర ఉద్రిక్తతల నడుమ కొట్టుమిట్టాడుతోంది. రాజధాని రియాద్ సహా పలు కీలక నగరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు పెరగడంతో, అక్కడ నివసిస్తున్న తమ పౌరులు, ప్రభుత్వ అధికారుల రక్షణపై అమెరికా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో సౌదీలోని తమ సిబ్బందికి అత్యవసర భద్రతా మార్గదర్శకాలను జారీ చేసింది.

ప్రయాణాలపై ఆంక్షలు.. ఆ రెండు నగరాలకు వెళ్లొద్దు!

పరిస్థితి ఏ క్షణంలో ఎలా మారుతుందో చెప్పలేమని అమెరికా విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ముఖ్యంగా తైఫ్, యాన్బు వంటి నగరాల్లో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందనే హెచ్చరికలతో, అక్కడ పనిచేస్తున్న తమ రాయబార కార్యాలయ సిబ్బందిపై ప్రయాణ ఆంక్షలు విధించింది. అధికారిక పనులకైనా, వ్యక్తిగత పనులకైనా ఈ నగరాలకు వెళ్లాల్సి వస్తే ముందస్తు అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేసింది. ఇక అక్కడ నివసిస్తున్న సాధారణ అమెరికా పౌరులు కూడా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, స్థానిక పోలీసుల ఆదేశాలను పాటించాలని సూచించింది.

US Issues Urgent Security Advisory for Employees in Saudi Arabia After Threatening Houthi Missile Strikes

రాజధానిని తాకిన క్షిపణి ముప్పు.. అప్రమత్తమైన క్షిపణి నిరోధక వ్యవస్థ

ఇటీవల హౌతీ గ్రూప్ సౌదీ అరేబియాపై దాడులను తీవ్రతరం చేసింది. నేరుగా రాజధాని రియాద్ లక్ష్యంగా బాలిస్టిక్ మిస్సైల్‌ను ప్రయోగించడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. అయితే, సౌదీ క్షిపణి నిరోధక దళాలు సకాలంలో స్పందించి ఆ క్షిపణిని గాలిలోనే ధ్వంసం చేయడంతో తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటన జరిగిన సమయంలో రియాద్ ఎయిర్‌పోర్టు సమీపంలో పెద్ద ఎత్తున పొగలు వ్యాపించి పేలుడు శబ్దాలు వినపడటంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. తైఫ్, బిష్, ఫరసాన్, యాన్బు ప్రాంతాల్లోని కీలక నిర్మాణాలు, జనావాసాలను సైతం లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగినట్లు సమాచారం.

రష్యాపై కనీవినీ ఎరుగని భారీ దాడి: మాస్కోలో సైతం.. !!
రష్యాపై కనీవినీ ఎరుగని భారీ దాడి: మాస్కోలో సైతం.. !!

ఇళ్లలోనే సురక్షితంగా ఉండండి.. ఏ క్షణంలోనైనా వైమానిక దాడులు!

పరిస్థితి అత్యంత సమస్యాత్మకంగా ఉన్నందున ప్రవాస అమెరికన్లకు పలు కీలక సూచనలు జారీ అయ్యాయి. ఆకాశంలో ఎలాంటి అనుమానాస్పద శబ్దాలు విన్నా లేదా ఏరియల్ దాడి సంకేతాలు కనిపించినా వెంటనే అద్దాల తలుపులు, కిటికీలకు దూరంగా ఇళ్లలోని సురక్షిత ప్రదేశాల్లో దాక్కోవాలని ఆదేశించారు. వీధుల్లో జరిగే ప్రదర్శనలకు, జనసమ్మర్ధ ప్రాంతాలకు దూరంగా ఉండాలని, అమెరికాకు చెందిన సంస్థలు లేదా రాయబార కార్యాలయాల వద్ద అత్యంత జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు. ప్రయాణాలకు ముందే వాతావరణం, విమాన రాకపోకల సమాచారాన్ని తరచూ చెక్ చేసుకోవాలని కోరారు.

అమెరికా స్థావరాలపై దాడులు చేయమని హౌతీలు అంగీకరించారు : ట్రంప్ కీలక వ్యాఖ్యలు
అమెరికా స్థావరాలపై దాడులు చేయమని హౌతీలు అంగీకరించారు : ట్రంప్ కీలక వ్యాఖ్యలు

మద్దతుగా నిలిచిన గల్ఫ్ దేశాలు.. వ్యతిరేకిస్తున్న ఖతార్

ఒకవైపు సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరుగుతుంటే, మరోవైపు యెమెన్ తిరుగుబాటుదారుల చర్యలను గల్ఫ్ దేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. సౌదీ అరేబియా సార్వభౌమాధికారాన్ని దెబ్బతీసేలా, పౌరుల ప్రాణాలకు ముప్పు తెచ్చేలా హౌతీలు చేస్తున్న దాడులను ఖతార్ విదేశాంగ శాఖ తప్పుపట్టింది. అంతర్జాతీయ నిబంధనలను ఉల్లంఘిస్తూ జరుపుతున్న ఈ దాడులకు వ్యతిరేకంగా సౌదీకి తమ పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేసింది. కాగా, మిడిల్ ఈస్ట్‌లో ప్రయాణాలు చేసే ప్రతి ఒక్కరూ ప్రస్తుతానికి అప్రమత్తంగా ఉండటం శ్రేయస్కరమని దౌత్యవర్గాలు హెచ్చరిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+