పసిడి కాంతుల్లో తిరుమల- బ్రహ్మోత్సవాల్లో జర్మనీ కళకారులు

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజైన ఆదివారం సాయంత్రం స్వర్ణరథోత్సవం.. కన్నుల పండువగా ముగిసింది. లక్షలాదిమంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీ మలయప్పస్వామివారు శ్రీదేవి, భూదేవి సమేతంగా స్వర్ణరథంపై తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దివ్యదర్శనం ఇచ్చారు. మంగళవాయిద్యాల మధ్య స్వర్ణరథోత్సవం అత్యంత వైభవంగా సాగింది. గోవిందుడి నామస్మరణతో తిరుమల పరవశించింది.

శ్రీవారి స్వర్ణరథోత్సవానికి ఆధ్యాత్మికంగా విశిష్ట స్థానం ఉంది. శ్రీదేవి సంపద, భూదేవి సమస్త ధాన్యసంపదకు ప్రతీకలుగా భావిస్తారు. శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీ మలయప్పస్వామివారు స్వర్ణరథంపై విహరించడం స్వామివారి వైభవం, సార్వభౌమత్వానికి ప్రతీకగా భక్తులు విశ్వసిస్తారు. ఈ ఉత్సవాన్ని దర్శించడం ద్వారా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారి అనుగ్రహంతో సకల శుభాలు, సుఖసంతోషాలు, ఐశ్వర్యం, ధాన్యసమృద్ధి కలుగుతాయని నమ్మకం.

Grand Brahmotsavams Moment Golden Chariot Utsavam Blessings as German troupe stole the show

ఈ స్వర్ణరథోత్సవంలో ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ భార్య వసుంధర పాల్గొన్నారు. టీటీడీ బోర్డు సభ్యురాలు, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డితో కలిసి రథాన్ని లాగారు.

అనంతరం.. సాయంత్రం గజవాహన సేవ నిర్వహించారు టీటీడీ అధికారులు. ఇందులో దేశ, విదేశాలకు చెందిన కళాకారులు తమ అద్భుత ప్రదర్శనలతో భక్తులను అలరించారు. వివిధ రాష్ట్రాలతో పాటు జర్మనీ నుంచి వచ్చిన 19 బృందాలకు చెందిన 528 మంది కళాకారులు గజవాహన సేవలో పాల్గొని తమ కళా ప్రదర్శనలతో తిరుమాడ వీధులకు ప్రత్యేక శోభను తీసుకువచ్చారు.

ఈ ప్రదర్శనల్లో జర్మనీకి చెందిన కళాబృందం ప్రదర్శించిన లక్ష్మీనృసింహ నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. జర్మనీలో నివసిస్తున్న ప్రవాస భారతీయులు ప్రదర్శించిన నృత్య రూపకం ఇది. దీనిద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయ కళలపై తమకున్న అభిమానం, భక్తి ప్రపత్తులను చాటారు. ఈ ప్రదర్శనను భక్తులు ఆసక్తిగా తిలకించారు. అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కళాకారులు పాల్గొన్నారు. ఆయా ప్రాంతాల జానపద, శాస్త్రీయ కళారూపాలను ప్రదర్శించారు.

ఏపీకి కళాకారులు శ్రీనివాస కళ్యాణం, భరతనాట్యం, కోలాటం, అస్సాం కళాకారులు తమ ప్రాంతీయ సంప్రదాయ కళను ప్రదర్శించారు. అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన కళాకారులు గాలో కళారూపంతో ఆకట్టుకున్నారు. కర్ణాటకకు చెందిన కళాకారులు కథక్, శ్రీ వేంకటేశ్వర వైభవం, యక్షగానం, అర్ధనారీశ్వర పార్వతి శివ కళ్యాణం, జగన్నాథాయ జగన్నాటకం, మూర నృత్యం, కుణిత భజన, కోలాటం తదితర ప్రదర్శనలు ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+