ఎక్సైజ్శాఖ అధికారి ఇంటిపై ఏసీబీ అధికారుల దాడి
విశాఖ: విశాఖపట్నంజిల్లా అనకాపల్లి ఎక్సైజ్ శాఖ అధికారి పుప్పాల గోవర్ధన్ రెడ్డి ఇంటిపై బుధవారం ఏసీబి అధికారులు దాడులు నిర్వహించారు. అక్రమ ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ దాడులు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ఇటీవల కాలంలో ఎక్సైజ్ అదికారులే ఎసిబికి చిక్కడం విశేషం.
సుమారు 50 లక్షల రూపాయల విలువగల ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. విశాఖ, అనకాపల్లి, హైదరాబాద్‌లలో ఆయన ఇళ్లపై ఏక కాలంగా దాడులు జరిపినట్లు వారు పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications
