భీమ్ సేన్ జోషికి భారతరత్న

Bhimsen Joshi
న్యూఢిల్లీ: హిందుస్థానీ సంగీత విద్వాంసులు పండిట్‌ భీమ్‌సేన్‌ జోషికి ప్రతిష్టాత్మక 'భారతరత్న ' పురస్కారం ప్రకటించారు. భారతదేశ అత్యున్నత పౌర పురస్కార ప్రకటన మంగళవారం రాత్రి వెలువడింది. 86 ఏండ్ల పండుటాకులాంటి భీమ్‌సేన్‌ తన 20వ ఏటనే తొలి సంగీత కచేరి నిర్వహించి, హిందుస్థానీ సంగీత హిమాలయ శ్రేణువులలో స్వర గంగను సృష్టించారు.

ఏడు దశాబ్దాలుగా ఆయన అలుపెరగని పాటల బాటసారిలా సాగుతూనే ఉన్నారు. కీర్ణ ఘరానాతో ప్రఖ్యాతి గాంచిన భీమ్‌సేన్‌ను భారత రత్న అవార్డుకు ఎంపిక చేయడం ముదావహమని రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌ పేర్కొన్నారని రాష్ట్రపతి భవన్‌ వర్గాలు తెలిపాయి. ఏడేళ్ల క్రితం షెహనాయి సంగీత స్వరకర్త ఉస్తాద్‌ బిస్మిల్లా ఖాన్‌కు ఈ పురస్కారం లభించింది. ఆ తరువాత ఈ అరుదైన గౌరవం మరో సంగీత కళాకారుడికే దక్కింది.

సంగీత సరాగాల ఖజానా కర్నాటకలోని గడగ్‌ జిల్లాలో 1922 ఫిబ్రవరి 22న భీమ్‌సేన్‌ జోషి జన్మించారు. ఆ యన స్వరాలకు అధిరోహణలే తప్ప అవరోహణలు తెలియవు. అందుకు అనుగుణంగానే ఆయనకు పద్మవిభూషణ్‌, పద్మ భూషణ, పద్మశ్రీ అ వార్డులు లభించాయి. భారతీయ శా స్త్రీయ సంగీతానికి బిస్మిల్లా ఖాన్‌, భీమ్‌సేన్‌ జోషిలు మధుర నిర్వచనం గా నిలుస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+