విజయవాడలో చిరు,బాబు కార్యకర్తల ఘర్షణ
విజయవాడ: విజయవాడలో తెలుగుదేశం పార్టీ - ప్రజారాజ్యంపార్టీ కార్యకర్తల మధ్య బుధవారం ఘర్షణ చెలరేగింది. విజయవాడలో చిరంజీవి కటౌట్‌ను గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. ఈ విధ్వంసానికి టిడిపి కార్యకర్తలే కారణమని పీఆర్పీ కార్యకర్తలు భావించారు.
ఎందుకంటే ఈ రోజు గుంటూరులో యువగర్జన జరగనున్న నేపథ్యంలో ఈ పని వారే చేసి ఉంటారని ఆరోపిస్తూ గుంటూరుకు తరలి వెళుతున్న టిడి పి కార్యకర్తలను బెజవాడ 9వ జాతీయ రహదారి వద్ద అడ్డుకున్నారు. దాంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.












Click it and Unblock the Notifications
