తెలుగుదేశం సభాప్రాంగణంలో జనమే జనం
గుంటూరు: తెలుగుదేశం యువగర్జనలో ప్రజా ప్రభంజనం వీస్తోంది. లక్షలాదిగా తరలి వచ్చిన ప్రజలకు సభాస్థలి సరిపోక పోవడంతో అభిమానులు, కార్యకర్తలు సమీపంలో చెట్లు, హోర్డింగులు ఎక్కేసారు. అయితే సామర్థ్యాన్ని మించి అభిమానులు చెట్లు, హోర్డింగులు ఎక్కడంతో వేదికపై ఉన్న నేతలు తీవ్ర ఆందోళనకు లోనై వారిని దిగమని పదే పదే విజ్ఞప్తులు చేయవలసి వచ్చింది.
అంతమంది చెట్లు ఎక్కితే చెట్లు విరిగి మీతో పాటు మీ ముందు ఉన్న వందలాది మందికి కూడా ఏదో ఒకటి అవుతుందని, అది చంద్రబాబు హర్షించరని నేతలు ఎంత నచ్చజెప్పడానికి ప్రయత్నించినా లాభం లేకపోయింది. దీనితో కొందరు ద్వితీయ శ్రేణి నేతలు స్వయంగా రంగంలోకి దిగి చెట్లు, హోర్డింగులను ఎక్కిన వారికి కిందకు దించడానికి వారు జనాన్ని తోసుకుంటూ వెళ్ళారు.












Click it and Unblock the Notifications
