అమెరికా ఎన్నికల్లో మహిళల మహత్తర పాత్ర
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎన్నడూ లేని విధంగా ఈసారి మహిళలకు లభించిన రాజకీయ ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. ప్రైమరీ ఎన్నికల్లో అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయిన హిల్లరీ క్లింటన్ మొదలుకొని, రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థిగా బరిలో నిలిచిన సారా పాలిన్ వరకూ ఎంతో మంది మహిళలకు ఈ ఎన్నికలు ప్రేరణగా నిలిచాయి.
ఎన్నికల ప్రారంభానికి ముందు ఒబామా తన అమ్మమ్మ హఠాన్మరణ వార్తకు స్పందిస్తూ, తన జీవి తంలో కనపడని హీరో ఆమే అని చెప్పడం మహిళల్ని బాగా ప్రభావితం చేసింది. అన్నిటి కంటే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మహిళలకు ఈపాటి గౌరవం లభించడం, వారి ప్రాధాన్యాన్ని గుర్తించడంతో అమెరికా మహిళల్లో కూడా రాజకీయాలపై ఆసక్తి పెరుగడానికి కారణమైంది.












Click it and Unblock the Notifications
