కెసిఆర్ తో అజిత్ సింగ్ భేటీ

ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనడానికి హైదరాబాద్ వచ్చిన అజిత్ సింగ్ ను కెసిఆర్ విందుకు ఆహ్వానించారు. అందుకు సమ్మతించి అజిత్ సింగ్ కెసిఆర్ ఇంటికి వచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సహకరించాలని కెసిఆర్ అజిత్ సింగ్ ను కోరారు. అందుకు ఆయన స్పష్టమైన హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు అవసరమైన వ్యూహం విషయంలో అజిత్ సింగ్ కెసిఆర్ కు కొన్ని సూచనలు చేశారు. కెసిఆర్ ఈ నెల 9వ తేదీన తిరుపతి శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకోనున్నారు.
కాంగ్రెస్ నేతృత్వంలోని ఐక్య ప్రగతిశీల కూటమి (యుపిఎ) ప్రభుత్వ బలపరీక్ష సమయంలో తెలంగాణ రాష్ట్ర సాధనకు పార్టీల మద్దతును కూడగట్టడానికి కెసిఆర్ ఢిల్లీలో ప్రయత్నించారు. ఇందులో భాగంగా యుపిఎకు వ్యతిరేకంగా పార్టీలను సమీకరించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా అజిత్ సింగ్ ను కూడా యుపిఎకు వ్యతిరేకంగా ఆయన తీసుకు రాగలిగారు.












Click it and Unblock the Notifications