స్పెషల్: చిరు కంటే బాలకృష్ణ బెటరా?

రోడ్ షోలు మొదలు పెట్టినప్పటి కంటే చిరంజీవి ప్రసంగాలు ఇప్పుడు పదును తేలాయనడంలో సందేహం లేదు. అయినా ఆయన ప్రసంగాల్లో మసలా ఇంకా పెరగాల్సి ఉంది. బాలకృష్ణ నిన్నటి తొలి రాజకీయ ప్రసంగంలో నవరసాలు పలికించారు. గుంటూరు మిర్చి ఘాటు ఆయన ప్రసంగంలో విరజిమ్మింది. తన తండ్రి ఎన్టీఆర్ రాజకీయాలను, ఆయన నిజాయితీని ఎక్కువగా ప్రస్తావించిన బాలకృష్ణ నట్లు కొట్టకుండా బాగా మాట్లాడడం విశేషం.
మొత్తం సమాజం అంగీకరించని సామాజిక వర్గానికి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహించడం ఆయన మైనస్ పాయింట్. మాంత్రికుడి వంటి చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రిని చేయడానికి ఆయన ప్రయత్నించబోవడం మరో పెద్ద మైనస్ పాయింట్. అయితే వ్యక్తిగతంగా చక్కటి ప్రసంగం చేయడంలో ఆయన చిరంజీవి కంటే ఎక్కువ మార్కులు కొట్టేయడం గొప్ప విశేషం.
చిరంజీవి రాజకీయాలకు కొత్త. ఆయన స్వయం కృషితో సినిమాల్లో, ఆ తర్వాత రాజకీయాల్లో ఎదిగారు. ఆయన ఎవరికీ వారసుడు కారు. సమాజంలో అణగారిన వర్గాల ప్రతినిధిగా ఆయన ముందుకు వస్తున్నారు. అయితే ఆయన బాలకృష్ణ తరహాలో ఆవేశంగా ప్రత్యర్ధి పార్టీల మీద విమర్శలు గుప్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.












Click it and Unblock the Notifications