రాహుల్ గాంధీతో కాంగ్రెస్ యువభేరీ

Rahul Gandhi
హైదరాబాద్‌: తెలుగుదేశం పార్టీ యువగర్జన సదస్సు విజయవంతం కావడంతో కాంగ్రెసు పార్టీలో కలవరం మొదలైంది. తెలుగుదేశం పార్టీ గుంటూరులో నిర్వహించిన యువగర్జనకు పెద్ద యెత్తున ప్రజలు తరలివచ్చారు. దీంతో కాంగ్రెసు దాన్ని మరిపించే రీతిలో ఒక సభను నిర్వహించాలనే ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. ఇటు చిరంజీవికి, అటు బాలకృష్ణకు పెద్ద యెత్తున ప్రజల ఆదరణ లభించడంతో తమకు కూడా ప్రజలు వస్తారని చెప్పుకోవడానికి తంటాలు పడాల్సిన స్థితిలో కాంగ్రెస్ పడింది.

రాష్ట్రంలో ఏదో ఒక చోట తమ పార్టీ యువనేత రాహుల్ గాంధీతో ఒక బహిరంగ సభను పెట్టాలని కాంగ్రెస్ నేతలు ఆలోచనలు చేస్తున్నారు. యువభేరీ పేర ఈ సభను నిర్వహించాలని అనుకుంటున్నట్లు సమాచారం. యువత కోసం కాంగ్రెసు చేస్తున్న మేలును, చేసే మేలును ఈ సభ ద్వారా వివరించాలనేదే కాకుండా తమ సభలకు కూడా ప్రజలు వస్తారని చెప్పుకోవడానికి ఈ సభను పెద్ద యెత్తున నిర్వహించాలనుకుంటున్నట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+