స్కూలు భవనం కూలి 50 మంది మృతి
హైతీ: హైతీ రాజధాని పోర్ట్-అ-ప్రిన్స్ సమీపంలో ఓ స్కూలు భవనం కూలిన దుర్ఘటనలో 50 మంది వరకు చిన్నారులు మృతిచెందారు. వందలమంది గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. మూడంతస్థుల ఈ స్కూలు భవనం క్లాసులు జరుగుతుండగా కూలింది. అందులో ఎక్కువభాగం పక్కనే ఉన్న ఇళ్లపై పడటంతో మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయం తెలిసి తల్లిదండ్రులు రోదిస్తూ ఆసుపత్రులకు పరుగుతీశారు. ఐక్యరాజ్యసమితి శాంతిసేనలు, ఇతరులు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. అక్కడ వాతావరణం భూకంపం వచ్చిన అనంతరం పరిస్థితిలా ఉంది. ఎటుచూసినా శిధిలాలు, పిల్లల ఆర్తనాదాలు చూసేవారి గుండెను ద్రవింపజేస్తున్నాయి.












Click it and Unblock the Notifications