ప్రధాని మన్మోహన్ గల్ఫ్దేశాల పర్యటన

ప్రస్తుత ప్రపంచ ఆర్థిక రంగం తీరుతెన్నుల కారణంగా ఈ అరుదైన అవకాశం ఇండియాకు లభించిందని ఆయన చెప్పారు. ఒమన్, ఖతార్ నాయకులతో తాను చర్చలు జరిపే సమయంలో గల్ఫ్ ప్రాంతంలో పని చేస్తున్న భారతీయుల సంక్షేమం గురించి కూడా ప్రస్తావిస్తానని ఆయన తెలిపారు.
ఆ రెండు దేశాల్లోను భారీ సంఖ్యలో భారతీయులు పని చేస్తున్నారు, రెండు దేశాల అభివృద్ధిలోను వారి పాత్రకు బహుధా ప్రశంసలు అందుతున్నాయి అని ఆయన వ్యాఖ్యానించారు. ఇక ఇంధన రంగంలో ఉభయులకు లాభదాయకమైన వ్యూహాత్మక భాగస్వామ్యం నెలకొల్పుకోగలమన్న విశ్వాసం ఆయన ప్రకటించారు. భారత ఉపఖండం భద్రత, సుసంపన్నతల దృష్ట్యా కూడా గల్ఫ్ ప్రాంతానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉన్నదని ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications