న్యూఢిల్లీ: న్యుమోనియాతో బాధపడుతూ రెండు రోజుల నుంచి స్థానిక ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న లోక్‌సభ స్పీకర్ సోమ్‌నాథ్ ఛటర్జీ ఆరోగ్యం కుదుటపడింది. దీంతో ఆయనను ఈరోజు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. వారం రోజులు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు తనకు సూచించారని సోమ్‌నాథ్ తెలిపారు.