శ్వేతసౌధంలోకి ఒబామా తొలి అడుగు

తర్వాత వైట్‌హైస్‌లోని అధ్యక్ష చాంబర్‌లోకి బుష్ ఒబామాను వెంటబెట్టుకుని వెళ్లారు. ప్రెసిడెంట్ చాంబర్‌లో ఒబామా అడుగు పెట్టడం ఇదే మొదటిసారి కావడం విశేషం. అమెరికా ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి వ్యక్తిగతంగా మాట్లాండేందుకు చారిత్రాత్మక ఓవెల్ ఆఫీసుకు బుష్ ఒబామాను తీసుకుపోయారు. జనవరి 20న ప్రమాణ స్వీకారం చేసేనాటికి దేశం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలూ ఒబామా తలకు చుట్టుకోనున్నాయి. ఒబామా విజయాన్ని అమెరికా విజయ గాథగా అభివర్ణించిన బుష్ నూతన అధ్యక్షుడు, సతీమణిని సాదరంగా వారి భవిష్యత్ సౌధంలోకి ఆహ్వానించారు.
వైట్‌హైస్‌లోనూ, కాంగ్రెస్ ఉభయ సభలలో డెమాక్రాటిక్ పూర్తి ఆధిపత్యం సాధించిన స్థితిలో ఒబామా బారక్ అమెరికా ప్రప్రథమ నల్ల అధ్యక్షుడిగా పదవీ ప్రమాణం చేయనున్నారు. ఈ కలయిక కేవలం వ్యక్తిగతమైనదే అయినందువల్ల ఇద్దరు అధ్యక్షులూ కలసి బహిరంగ ప్రకటన లాంటివి చేయలేదని వైట్‌హౌస్ ప్రెస్ కార్యదర్శి డేనా పెరినో చెప్పారు.












Click it and Unblock the Notifications