ఖమ్మం అడవుల్లో హెలికాప్టర్ శకలాలు
ఖమ్మం: మూడు నెలల క్రితం అదృశ్యమైన హెలికాప్టర్ శకలాలు ఖమ్మం జిల్లా అడవుల్లో కనిపించాయి. ఆగస్టు 3వ తేదీన ఈ హెలికాప్టర్ హైదరాబాద్ నుంచి ఛత్తీస్ ఘడ్ కు బయలుదేరింది. ఛత్తీస్ ఘడ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ కోసం ఆ హెలికాప్టర్ ను అద్దెకు తీసుకున్నారు. అయితే ఆగస్టు 3వ తేదీన బయలుదేరిన హెలికాప్టర్ సాయంత్రానికి ఛత్తీస్ ఘడ్ చేరుకోవాల్సి ఉంది. అయితే అది అక్కడికి చేరుకోలేదు. ఈ విషయాన్ని ఛత్తీస్ ఘడ్ ప్రభుత్వ అధికారులు ఆంధ్రప్రదేశ్ అధికారులకు విషయం చెప్పారు. దీంతో హెలికాప్టర్ కోసం ఇరు రాష్ట్రాల వారు దాదాపు నెలపాటు గాలింపు చర్యలు చేపట్టారు. అయినా ఫలితం లేకపోయింది.
హెలికాప్టర్ శకలాలు ఖమ్మం జిల్లా వెంకటాపురం మండలం పామునూరు గ్రామానికి సమీపంలోని దండకారణ్యంలో కనిపించాయి. వాటిని చూసిన గిరిజనులు విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. సంఘటనా స్థలంలో నలుగురి ఫొటో గుర్తింపు కార్డులు కూడా లభించాయి. దీన్ని బట్టి నలుగురు వ్యక్తులు మరణించినట్లు తెలుస్తోంది. సాంకేతిక లోపాల వల్లనే హెలికాప్టర్ కూలిపోయినట్లు భావిస్తున్నారు. హెలికాప్టర్ అదృశ్యం వెనక తమ హస్తం లేదని మావోయిస్టులు ఇది వరకే ప్రకటించారు.












Click it and Unblock the Notifications