సంఘీ సలహాలు ఇచ్చారు: చిరు

గిరీష్ సంఘీ చిరంజీవితో మంతనాలు జరపడంపై కాంగ్రెస్ ఆరా తీసింది. ఈ మధ్య గిరీష్‌సంఘీ కాంగ్రెస్ కార్యక్రమాలకు దాదాపు దూరంగా ఉంటున్నారు. రాత్రి 9.20 గంటలకు దేవాలయానికి వచ్చిన చిరంజీవి దంపతులు 15 నిమిషాల్లో పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుని సంఘీ నివాసంలో దాదాపు రెండు గంటలకుపైగా గడిపారు. తిరిగి వెళ్లే సమయంలో విలేకరులు చిరంజీవిని వివరాలు కోరగా, తన సతీమణి కోరిక మేరకు కార్తీక పౌర్ణమి సందర్భంగా గుడిలో పూజలు నిర్వహించేందుకు వచ్చామని తెలిపారు. గిరీష్ సంఘీ తనకు చిరకాల మిత్రుడని, ఆయన ఆహ్వానం మేరకు తన నివాసానికి వెళ్లినట్లు తెలిపారు. రాజకీయపరంగా ఎవరి పార్టీ వారిదే అయినా తన రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి గిరీష్ కొన్ని సలహాలు ఇచ్చినట్లు చెప్పారు. గిరీష్ ఇంట్లోనే చిరంజీవి దంపతులు భోజనంచేసి బయల్దేరారు.












Click it and Unblock the Notifications