నిందితుడి అనుమానాస్పద మృతి
మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లా కోస్గి పోలీస్‌స్టేషన్‌లో ఓ నిందితుడు అనుమానాస్సదంగా మృతి చెందాడు. కోస్గి మండలం అమలికుంట గ్రామస్థుడు బోగం శ్రీనివాస్ రెడ్డిని పోలీసులు ఓ కేసులో పట్టుకుని లాకప్‌లో పెట్టారు. గురువారం రాత్రి అతన్ని హడావుడిగా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే అతను మృతి చెందినట్లు తెలుస్తోంది. 108 వాహనం అందుబాటులో ఉన్నా హడావిడిగా అక్కడినుంచి ప్రైవేటు వాహనంలో అతన్ని తరలించటం పలు అనుమానాలకు తావిచ్చింది. అతన్ని చితకబాదినందునే లాకప్‌లో మరణించాడంటూ బంధువులు ఆందోళనకు దిగారు. పోలీస్‌స్టేషన్ వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటుచేశారు.












Click it and Unblock the Notifications