లగడపాటికి మధు యాష్కీ హెచ్చరిక
హైదరాబాద్: కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ తన నోటికి తాళం వేసుకోవాలని అదే పార్టీకి చెందిన నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు మధుయాష్కీ హెచ్చరించారు. తెలంగాణ ప్రజల మనోభావాలను రెచ్చగొడితే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని అన్నారు. తన పెట్టుబడుల కోసం, స్వార్థ ప్రయోజనాల కోసం మాట్లాడుతున్న ఆంధ్ర నాయకులు హద్దు మీరి ప్రవర్తించవద్దని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) పొత్తుల గురించి మాట్లాడే అర్హత లగడపాటికి లేదని మధుయాష్కీ అన్నారు.
తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు క్షమాపణ చెప్తేనే ఆ పార్టీతో పొత్తు గురించి ఆలోచిస్తామని లగడపాటి రాజగోపాల్ గురువారం అన్నారు. కాంగ్రెసుతో పొత్తుల గురించి కెసిఆర్ మాట్లాడితే సహించబోమని ఆయన అన్నారు. రాష్ట్ర విభజన అనేది పిల్లలాట కాదని ఆయన వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications