వైఎస్ బామ్మర్ది భూముల వద్ద టిడిపి లొల్లి
హైదరాబాద్: ముఖ్యమంత్రి, ఆయన కుటుంబసభ్యులు, బంధువుల ఆస్తుల వివరాలను బయటపెట్టడానికి ఉన్నతస్థాయి విచారణ జరిపించాలని తెదేపా డిమాండ్ చేసింది. హైటెక్ సిటీ వద్ద ముఖ్యమంత్రి బావమరిది రవీంద్రనాథ్‌రెడ్డి ఆక్రమించుకున్నారని ఆరోపణలు వస్తున్న భూమి వద్ద తెదేపా నేతలు ఈరోజు ఆందోళన చేపట్టారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తెదేపా అధికారంలోకి రాగానే వైఎస్, ఆయన కుటుంబ సభ్యుల అక్రమ సంపాదనలపై న్యాయవిచారణ జరిపించి, వాటిని పేదలకు పంచుతామని పార్టీ నేతలు ప్రకటించారు. భూముల ఆక్రమణలు, కబ్జాలు, వేలాలు వైఎస్ సర్కారుకు నిత్యకృత్యమయ్యాయని వారు విమర్శించారు. రవీంద్రనాథ్‌రెడ్డి రిజిస్ట్రేషన్ చేయించుకున్న భూమిలో ప్రధాన భాగం ప్రభుత్వానిదనీ, దీన్ని నిరూపించడానికి తాము సిద్ధమని దేశం నేతలు చెప్పారు.












Click it and Unblock the Notifications