అమెరికాలోని ఎపి విద్యార్థి శశాంక్ క్షేమం
వరంగల్: అమెరికాలో నల్లజాతీయుల కాల్పుల్లో గాయపడిన శశాంక్ క్షేమంగా ఉన్నట్లు సమాచారం అందింది. వరంగల్ కు చెందిన శశాంక్ అనే విద్యార్థిపై నల్లజాతీయులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈ కాల్పుల్లో గాయపడిన శశాంక్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కోలుకున్నాడు. ఏడాదిన్నర క్రితం అమెరికా వెళ్లిన శశాంక్ టెన్నెసీలోని మిడిల్ టెన్నెసీ విశ్వవిద్యాలయంలో ఎంఎస్ చదువుతున్నాడు. శశాంక్ హుజూరాబాదులోని ఒక ప్రైవేట్ కళాశాలలో ఇంజనీరింగ్ పూర్తి చేశాడు.
కారులోని బ్యాగ్ ను తీసుకునే సమయంలో శశాంక్ పై కాల్పులు జరిగాయి. కాల్పులకు కారణం ఏమిటనేది తెలియరాలేదు. శశాంక్ కోలుకోవడంతో ఆయన బంధువులు ఊపిరి పీల్చుకున్నారు. గత కొంత కాలంగా ఆంధ్రప్రదేశ్ కు చెందిన విద్యార్థులు అమెరికాలో హత్యకు గురి కావడం ఆనవాయితీగా మారింది. శశాంక్ సంఘటన మరోసారి ఆంధ్రప్రదేశ్ లో కలకలం సృష్టించింది.












Click it and Unblock the Notifications