టిడిపి ప్రకటనలు ఊకదంపుడు: పొన్నాల
హైదరాబాద్: మహారాష్ట్ర ప్రభుత్వం గోదావరి నదిపై నిర్మిస్తున్న బాబ్లీ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిందని, అయినా తెలుగుదేశం పార్టీ నాయకులు రాజకీయ లబ్ధి కోసం ఆందోళనకు దిగుతున్నారని భారీ నీటి పారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు. త్వరలో సుప్రీంకోర్టులో ఆ కేసు విచారణకు రానుందని, ఈ స్థితిలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఆందోళనకు దిగడం సరైంది కాదని ఆయన అన్నారు.
తెలుగుదేశం పార్టీ నాయకులు రాజకీయల ప్రయోజనాల కోసమే ఆందోళనకు దిగుతున్నారని ఆయన విమర్శించారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి ఆనకట్ట ఎత్తు పెంచుతుంటే నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారని, ఇప్పుడు ఊకదంపుడు ప్రకటనలు చేస్తున్నారని, ఇది రాజకీయం తప్ప మరోటి కాదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications