31 మంది మావోయిస్టుల లొంగుబాట
విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లాలో మావోయిస్టులకు ఎదురుదెబ్బ తగిలింది. 31 మంది మావోయిస్టులు సోమవారం జిల్లా ఎస్పీ ముందు లొంగిపోయారు. లొంగిపోయినవారిలో ఆరుగురు కమాండర్లు, ముగ్గురు డిప్యూటీ కమాండర్లు ఉన్నారు. వారి నుంచి పోలీసులు విధ్వంసకర పదార్థాలు, విప్లవ సాహిత్యం స్వాధీనం చేసుకున్నారు.
ఈ మావోయిస్టులు గునుకురాయి 1,2 ప్లాటూన్లకు చెందినవారని ఎస్పీ చెప్పారు. వీరు గునుకురాయి ఎదురుకాల్పుల్లో పాల్గొన్నారని, అయితే వారిపై ఏ విధమైన కేసులు నమోదు చేయడం లేదని ఆయన చెప్పారు. జిల్లాలో ఇంత పెద్ద యెత్తున మావోయిస్టులు లొంగిపోవడం ఇదే ప్రథమమని ఆయన చెప్పారు. మావోయిస్టులు లొంగిపోవడానికి ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications