వుమెన్స్ హాస్టల్లో మెడికో కలకలం
వరంగల్: వరంగల్ కాకతీయ వైద్య కళాశాల ఉమెన్స్ హాస్టల్‌లో ఓ ఫైనలియర్ మెడికో అశ్విన్ చొరబడిన సంఘటన కలకలం రేపింది. తన జూనియర్ అయిన ఓ అమ్మాయిని కలిసేందుకు అతను సోమవారం రాత్రి హాస్టల్‌కు వచ్చాడు. గదిలో వారు మాట్లాడుకుంటుండగా వాచ్‌మెన్ తలుపు గడియ వేసి వార్డెన్‌ను పిలిచాడు. వార్డెన్ తలుపు తీయగానే అతను వారిని నెట్టివేసి గోడదూకి పారిపోయాడు.
గతంలో అతను మెడికో విద్యార్థినితో ఘర్షణ పడటంతో హాస్టల్‌నుంచి పంపేశారు. పరీక్షల కోసం ప్రిన్సిపాల్ అనుమతి తీసుకుని హాస్టల్లో ఉంటున్నాడు. ఈ ఘటనపై కాలేజి యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదుచేసింది. హాస్టల్ సెక్యూరిటీ గార్డులను సస్పెండ్ చేశారు. అశ్విన్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రిన్సిపల్ తెలిపారు. గతంలో అశ్విన్ పై ర్యాగింగ్ కేసు నమోదైంది. అతను అమ్మాయిలను ప్రేమ పేరుతో వేధిస్తూ ఉంటాడదని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications