కడపలో జగన్ పై పోటీకి పవన్ కల్యాణ్?

Pawan Kaiyan
హైదరాబాద్: కడప లోక్ సభ స్ధానం నుంచి ఈ సారి వైఎస్‌ కుమారుడు జగన్మోహన్‌రెడ్డి పోటీ ఖాయమైంది. అయితే జగన్‌ను దీటుగా ఎదుర్కొనేందుకు వీలుగా చిరంజీవి సోదరుడు, సినీ నటుడు పవన్‌ కల్యాణ్‌ను అక్కడి నుంచి పోటీకి దించాలని ప్రజారాజ్యం పార్టీ యోచిస్తున్నట్లు తెలిసింది. చిరంజీవి రాయలసీమ పర్యటనకు ముందే ఈ ఆలోచన వచ్చినట్లు చెబుతున్నారు.

వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయకుండా, రాష్ట్రమంతటా పార్టీ తరఫున ప్రచారం మాత్రమే చేయాలని పవన్‌ కల్యాణ్‌ అభిప్రాయపడుతున్నట్లు తెలిసింది. అయితే కడప జిల్లాలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా అక్కడ కాంగ్రెస్‌ను గట్టిగా ఎదుర్కోవాలంటే కడపలో పవన్‌ పోటీ చేయడమే మార్గమని పీఆర్‌పీ నేతలు అభిప్రాయపడుతున్నారు.

పవన్‌ పోటీ వల్ల కడప జిల్లాలో నేతలు, కార్యకర్తల ఆత్మస్థైర్యం పెరగడంతో పాటు రాయలసీమ అంతటా కూడా ఇది సానుకూల ప్రభావం చూపిస్తుందనేది పీఆర్‌పీ వ్యూహంగా ఉంది. ముఖ్యమంత్రి వైఎస్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల అసెంబ్లీ స్థానం కడప లోక్‌సభ పరిధిలోనే ఉంది. పవన్‌ను కడప నుంచి బరిలోకి దించడం ద్వారా జగన్‌ను, కొంతమేర వైఎస్‌ను కడప జిల్లాకే పరిమితం చేయాలన్నది పీఆర్‌పీ ఎత్తుగడగా కనిపిస్తోంది. ఈ విషయమై పీఆర్‌పీలో ప్రాథమిక చర్చలు కూడా జరిగినట్లు విశ్వసనీయ సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+