పులివెందులలో మీసం మెలేసిన చిరు

పులివెందులలో చిరంజీవి కార్యక్రమానికి ప్రజలు పోటెత్తారు. ఆయన ప్రసంగానికి ఈలలు, కేకలతో ప్రతిస్పందించారు. తాను మొగల్తూరులో పుట్టానంతేనని, ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి ఊరితో తనకు అనుబంధం పెనవేసుకుని పోయిందని ఆయన అన్నారు. ప్రతి ఊరు సొంతమనే పద్ధతిలో అభివృద్ధి చేస్తానని ఆయన చెప్పారు. ఆత్మబంధువుగా వచ్చావని ప్రజలు తనను ఆదరిస్తున్నారని ఆయన అన్నారు. పులివెందుల దాడి ఘటనపై శాంతియుతంగా నిరసన తెలుపుతున్నందుకు హ్యాట్సాఫ్ అని ఆయన అన్నారు.
రాష్ట్రమంతా పులివెందుల మాదిరిగా అభివృద్ధి చెందాలని ఆయన అన్నారు. రాజకీయాల్లోకి ఎవరైనా రావచ్చునని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి అన్నారని, అందువల్ల తన పర్యటనను ఎవరూ అడ్డుకోవద్దని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ అంతా పులివెందులలా అభివృద్ధి చెందాలన్నదే తన ఆకాంక్ష అని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడికైనా వెళ్లవచ్చునని ఆయన అన్నారు. చిన్న చిన్న ఆటంకాలకు కార్యకర్తలు బెదరవద్దని, కలిసికట్టుగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఎస్ ఇజెడ్ లోకి వెళ్లవద్దంటున్నారు, స్పెషల్ పొలిటికల్ జోన్లు ఏమైనా పెట్టారా అని ఆయన ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications