పులివెందులలో దాడిపై ఇసికి ఫిర్యాదు
న్యూఢిల్లీ: కడప జిల్లా పులివెందులలో తమ నేతలపై కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన దాడిపై ప్రజారాజ్యం పార్టీ ప్రతినిధులు గురువారం కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఆ పార్టీ అధికార ప్రతినిధులు పరకాల ప్రభాకర్, కేఎస్సార్ మూర్తి ఎన్నికల ప్రధాన అధికారి గోపాలస్వామిని కలిసి దాడిపై ఫిర్యాదు చేశారు. అందుకు ఆధారాలను జతచేశారు. తమ ఫిర్యాదుపై విచారించి తగిన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారని ప్రజారాజ్యం నేతలు తెలిపారు.
రాష్ట్రంలో ప్రజాస్యామ్యానికి రక్షణ లేకుండా పోయిందని పరకాల ప్రభాకర్ అన్నారు. ఎన్నికలు సజావుగా సాగుతాయనే నమ్మకం లేదని, వచ్చే ఎన్నికల్లో హింస చెలరేగే ప్రమాదం ఉందని ఆయన అన్నారు. నిర్భయంగా ప్రజలు ఓటేసే వాతావరణం రాష్ట్రంలో లేదని ఆయన విమర్శించారు.












Click it and Unblock the Notifications