సూరి సహా నిందితులపై కేసు కొట్టివేత
అనంతపురం: తెలుగుదేశం పార్టీ దివంగత శాసనసభ్యుడు పరిటాల రవి ముఖ్య అనుచరుడు తగరకుంట ప్రభాకర్ హత్య కేసును అనంతపురం కోర్టు సోమవారం కొట్టేసింది. పరిటాల రవి హత్య కేసులో నిందితుడు మద్దెలచెర్వు సూరి సహా మిగతా ఆరుగురు నిందితులపై కేసును కోర్టు కొట్టేసింది. ప్రాసిక్యూషన్ సరైన సాక్ష్యాలను ప్రవేశపెట్టకపోవడంతో కేసును కోర్టు కొట్టేసింది. తగరకుంట ప్రభాకర్ హత్య కేసులో పోలీసులు పది మందిపై అభియోగాలు మోపారు.
పరిటాల రవి హత్య కేసులోని నిందితుల్లో ఆరుగురు తగరకుంట ప్రభాకర్ హత్య కేసులో కూడా నిందితులు. వీరిలో మొద్దు శీను హత్యకు గురయ్యాడు. రమణ అనే నిందితుడు పరారీలో ఉన్నాడు. మొత్తం పది మంది నిందితుల్లో ముగ్గురు బెయిల్ పై ఉన్నారు. తగరకుంట ప్రభాకర్ హత్య 2004 సెప్టెంబరు 5వ తేదీన జరిగింది.












Click it and Unblock the Notifications