చిరు పౌరుషానికి ప్రతీక: ఉపేంద్ర
హైదరాబాద్: ఎన్టీఆర్ తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక అయితే, ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి పౌరుషానికి ప్రతీక అని మాజీ పార్లమెంటు సభ్యుడు పర్వతనేని ఉపేంద్ర అన్నారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఆయన సోమవారం చిరంజీవి సమక్షంలో ప్రజారాజ్యం పార్టీలో చేరారు. చిరంజీవి మూడు ప్రాంతాల పర్యటనలు విజయవంతమయ్యాయని ఉపేంద్ర అన్నారు. రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో ప్రజారాజ్యం ఒంటరిగా పోటీ చేయాలనేది తన అభిప్రాయమని, అయితే పొత్తులు చిరంజీవి ఇష్టమని ఆయన అన్నారు.
ప్రజల కోరిక మీద, అభిమానుల ఒత్తిడితో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించారని, ఇది చిరంజీవి విశిష్టత అని ఆయన అన్నారు. ప్రజారాజ్యం పార్టీ దేశంలో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుందని ఆయన అన్నారు. పులివెందులలో ప్రజారాజ్యం పార్టీ నేతలపై కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దాడి చేయడాన్ని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ఖండించకపోవడం విచారకరమని ఆయన అన్నారు. సీనియర్లు రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడతారని, అందుకే ఉపేంద్రను పార్టీలోకి ఆహ్వానించామని చిరంజీవి చెప్పారు.












Click it and Unblock the Notifications