కాంగ్రెస్ సీనియర్ నేత కొమ్మినేని మృతి
హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత కొమ్మినేని శేషగిరిరావు హఠాన్మరణం చెందారు. ఆదివారం రాత్రి ఆయనకు గుండెపోటు రావటంతో కేర్ ఆసుపత్రిలో చేర్చారు. కృష్ణా జిల్లాకు చెందిన శేషగిరిరావు 1975లో ఇందిరాగాంధీ హయాంలో రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు. వై.ఎస్. రాజశేఖరరెడ్డి, చంద్రబాబునాయుడు ఆయన హయాంలో యువజన కాంగ్రెస్‌లో కీలక భూమిక నిర్వహించారు. ప్రస్తుతం ఆయన రాజీవ్ పంచాయతీ సంఘటన్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా ఉన్నారు. శేషగిరి రావు మృతికి ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ సంతాపం ప్రకటించారు. మంత్రులు కె. రోశయ్య, మండలి బుద్ధప్రసాద్ కూడా కొమ్మినేని శేషగిరిరావు మృతికి సంతాపం ప్రకటించారు.












Click it and Unblock the Notifications