అమెరికాలో ఇద్దరు ఇండియన్ల హత్య
న్యూజెర్సీ: అమెరికాలోని పసిఫిక్ కౌంటీలోని న్యూజెర్సీలో గల కనయా జాకోబ్ చర్చిలో ఆదివారం జరిగిన కాల్పుల్లో ఇద్దరు భారతీయులు మరణించారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. కేరళలోని కడతుర్తికి చెందిన రేష్మ (25) అక్కడికక్కడే మరణించగా, జాన్ మల్లుసెరిల్ (23) ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించాడు. సిల్వై పెరించరిల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి ఆందోళకరంగా ఉంది. రేష్మకు, ఆమె భర్త సనీష్ జోసెఫ్ (27)కు మధ్య ఉన్న తగాదాలే ఈ హత్యకు కారణమని భావిస్తున్నారు.
జోసెఫ్ కాలిఫోర్నియాలోని సక్రామెంటోలో ఉంటాడు. అతను జీపులో న్యూజెర్సీకి వచ్చాడు. పోలీసులు ఆ జీపు కోసం గాలిస్తున్నారు. జోసెఫ్ పారిపోయినట్లు భావిస్తున్నారు. పెరించరిల్ రేష్మ ఆంటీ. జోసెఫ్ ను చల్లబరచడానికి మల్లుసెరిల్ అక్కడికి వచ్చినట్లు భావిస్తున్నారు. జనవరిలో జోసెఫ్ ను పెళ్లాడి రేష్మ అమెరికాకు వచ్చింది. సమస్యల వల్ల నెల రోజుల కోసం కేరళ వెళ్లి తిరిగి వచ్చారు. అయితే కుటుంబ తగాదాలు తగ్గిపోలేదు. దీంతో రేష్మా న్యూజెర్సీకి వచ్చేసింది. పెరించరిల్ న్యూజెర్సీలో చర్చి సండే స్కూల్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు.












Click it and Unblock the Notifications