హ్యాకింగ్ కు గురైన సిఐడి వెబ్ సైట్
హైదరాబాద్: రాష్ట్రానికి చెందిన సిఐడి వెబ్ సైట్ హ్యాకింగ్ కు గురైంది. పాకిస్తాన్ తీవ్రవాదులు ఈ వెబ్ సైట్ ను హ్యాక్ చేసి సిఐడి వెబ్ సైట్ లోని సమాచారాన్ని తొలగించి తమ సమాచారాన్ని ఉంచారు. హ్యాకింగ్ జరిగిన మాట వాస్తవమేనని, అయితే కీలకమైన సమారాచారమేదీ పోలేదని పోలీసు ఉన్నతాధికారి ఎ.కె. ఖాన్ చెప్పారు. ఈ వెబ్ సైట్ లో కరుడు గట్టిన నేరస్థుల, ఐఎస్ఐ తీవ్రవాదుల సమాచారం పెట్టామని ఆయన చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు.
తీవ్రవాదులు పాకిస్తాన్, భారత ప్రభుత్వాల వెబ్ సైట్లను కొన్నింటిని హ్యాక్ చేశారు. భారత వెబ్ సైట్ల హ్యాకింగ్ కు తామే కారణమని పాకిస్తాన్ కు చెందిన తీవ్రవాద సంస్థ జోంబియో - కెఎస్ఎ ప్రకటించుకుంది. భారతదేశానికి చెందిన ఒఎన్ జిసి, పాకిస్తాన్ కు చెందిన ఒజిఆర్ఎ వైబ్ సైట్లను తీవ్రవాదులు హ్యాక్ చేశారు. గార్డ్స్ ఆఫ్ హిందూస్తాన్ పేరిట హెచ్ఎంజి అనే సంస్థ పాకిస్తాన్ వెబ్ సైట్లను హ్యాక్ చేయగా, పాకిస్తాన్ సైబర్ ఆర్మి (పిసిఎ) పేరిట ఐదు భారత వైబ్ సైట్లను హ్యాక్ చేశారు. ఒఎన్జీసి, ఇండియన్ రైల్వే వెబ్ సైట్లను వెంటనే పునర్నిర్మించారు.












Click it and Unblock the Notifications