కరీంనగర్ జిల్లాలో నక్సలైట్ హతం
కరీంనగర్: కరీంనగర్ జిల్లా కోనారావు పేట మండలం గొల్లపల్లి గ్రామ శివారులో పోలీసులకు, నక్సలైట్లకు మధ్య జరిగిన ఎన్ కౌంటర్లో ఒక నక్సలైట్ మరణించాడు. ఈ ఎన్ కౌంటర్ బుధవారం మధ్యాహ్నం జరిగింది. మరణించిన నక్సలైటును జనశక్తి గ్రూపునకు చెందిన రమేష్ గా గుర్తించారు. జాన్సన్ అనే జనశక్తి కమాండర్ తప్పించుకుని పారిపోయాడని పోలీసులు చెబుతున్నారు. సంఘటనా స్థలంలో ఒక తపంచాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
తాము గాలింపు చర్యలకు వెళ్లినప్పుడు ఇద్దరు నక్సలైట్లు చర్చించుకుంటున్నారని, తమను చూసి జాన్సన్ అంగరక్షకుడు కాల్పులు జరిపాడని, దాంతో తాము ఎదురుకాల్పులు జరిపామని, ఈ ఎదురు కాల్పుల్లో ఒక నక్సలైట్ మరణించాడని పోలీసులు చెబుతున్నారు. అయితే జాన్సన్ పోలీసుల అదుపులోనే ఉన్నట్లు అనుమానిస్తున్నారు. దీన్ని పోలీసులు ఖండిస్తున్నారు.












Click it and Unblock the Notifications