వీరప్పన్ భార్య ముత్తలక్ష్మి అరెస్టు

పాలార్ బాంబు పేలుళ్ల కేసులో ప్రధాన నిందితురాలిగా ముత్తులక్ష్మిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ పేలుళ్ల సంఘటనలో 22 మంది మరణించారు. రంగస్వామివాడి సంఘటనలో కూడా ఆమెపై పోలీసులు నేరారోపణ చేశారు. ఈ సంఘటనలో ఐదుగురు మరణించారు. అలాగే రాంపురా పోలీసు స్టేషనుపై దాడి కేసును కూడా ఆమె పెట్టారు. ఈ దాడిలో ఐదుగురు మరణించారు. అటవీ శాఖాధికారి శ్రీనివాస్ హత్య కేసులో కూడా ముత్తులక్ష్మి పాత్ర ఉన్నట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు. పలు నేరాలతో సంబంధం ఉన్న గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఆపరేషనులో నాలుగేళ్ల క్రితం మరణించాడు.












Click it and Unblock the Notifications