ముంబైలో హైదరాబాదీల మృతి
హైదరాబాద్: ముంబయి ఉగ్రవాదుల పంజాకు ఇద్దరు హైదరాబాదీలు బలైనట్లు సమాచారం అందింది. లక్ష్మీనారాయణ గోయల్ అనే వ్యక్తి ముంబయిలో ఉగ్రవాదులు జరిపిన బాంబు పేలుడులో హతమైనట్లు హైదరాబాదుకు సమాచారం అందింది. గోయల్ వ్యక్తిగత పనిపై ఆదివారంనాడు ముంబయి వెళ్లాడని, హైదరాబాదుకు తిరిగి వస్తున్న సమయంలో తీవ్రవాదులు పేల్చిన బాంబుకు బలయ్యాడని ఆయన బంధువులు చెప్పారు.
తాను రావాలనుకున్న ఒక రైలు తప్పిపోవడంతో మరో చోట అందుకోవడానికి టాక్సీలో బయలుదేరాడని, ఆ సమయంలో పేలుడు సంభవించి లక్ష్మీనారాయణ గోయల్ మరణించాడని వారు చెప్పారు. తాము ఆ రోజు ఫోనులో మాట్లాడామని కూడా చెప్పారు. తాజాగా విజయరావు బాంజే అనే వ్యక్తి తాజ్ హోటల్లో ఉగ్రవాదుల చేతిలో మరణించినట్లు ఇక్కడికి సమాచారం అందింది. విజయరావు బాంజే తాజ్ హోటల్లో చీఫ్ చెఫ్ గా పనిచేస్తున్నట్లు సమాచారం. హైదరాబాదులోని ఆయన బంధువులెవరూ మాట్లాడే స్థితిలో లేరు.












Click it and Unblock the Notifications
